Ez4ev To Soon Launch On-Demand Mobile
Charging Stations for Electric Vehicles
ఈజెడ్4ఈవీ
'ఈజుర్జా' అనే ఆన్ డిమాండ్ మొబైల్
ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఈ రోజుల్లో ప్రతి
ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఛార్జింగ్
సమస్య వల్ల కొందరు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, ఈ సమస్యకు చెక్
పెడుతూ బ్యాటరీ స్టోరేజీ, ఛార్జర్ డెవలప్ మెంట్ కంపెనీ ఈజెడ్4ఈవీ రాబోయే మూడు నెలల్లో 'ఈజుర్జా' అనే ఆన్ డిమాండ్ మొబైల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను
ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనదారులను
వేదిస్తున్న సమస్య చెక్ పెట్టినట్లు అయ్యింది. ఈ మొబైల్ ఎలక్ట్రిక్ వేహికల్
ఛార్జింగ్ స్టేషన్లు కస్టమర్లు ఎంచుకున్న ప్రాంతాల వద్ద కంపెనీ ఏర్పాటు చేయనుంది.
అలాగే, కస్టమర్లు
మొబైల్ ఎటిఎంలను లొకేట్ చేసినట్లుగా ఈ మొబైల్ స్టేషన్లను గుర్తించగలుగుతారు.
మెరుగైన ఈవీ కనెక్టివిటీని అందించడం కొరకు చిన్న పట్టణాల్లో, వివిధ నగరాలు, హైవేల్లో 'ఈజుర్జా'
మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఛార్జింగ్ స్టేషన్లు 'ఛార్జింగ్-ఆన్-డిమాండ్' వ్యవస్థ ఆధారంగా
పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఒటీ) పరికరం ఇందులో ఉంటుంది. "ఈ మొబైల్
ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఈవీ యజమానుల పడుతున్న ఆందోళనను
తగ్గిస్తుంది. దేశంలో ఈవి ఛార్జింగ్ పాయింట్లు లేని దగ్గర వీటిని ఏర్పాటు
చేయనున్నట్లు" కంపెనీ సీఈఓ సతీందర్ సింగ్ చెప్పారు.
ఈ ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఫాస్ట్
ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది 100 శాతం కార్బన్ ఉద్గార
రహిత శక్తిని ఉపయోగించి రీఛార్జింగ్ చేయడానికి లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్
వ్యవస్థను కలిగి ఉంది. ఈ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తాయి.
దేశంలో మొబైల్ ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఛార్జింగ్ మౌలిక
సదుపాయాల సమస్యను పరిష్కరించడంలో సహాయపడగలదని ఈజెడ్4ఈవీ
విశ్వసిస్తుంది. భారతీయ ఈవి రంగంలో 'ఇన్ ఫ్రా-యాజ్-ఎ-సర్వీస్'
ద్వారా సృజనాత్మక ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్లో కీలక పాత్రను
పోషించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
0 Komentar