Facebook India Launches Loans Programme for
Small Businesses In 200 Places
చిన్న కంపెనీలకు ఫేస్‌బుక్ రుణ
సాయం!
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్
మరొకొత్త ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. తమ ప్లాట్‌ఫాంపై వాణిజ్య ప్రకటనలు ఇచ్చే
చిన్న,
మధ్య తరహా పరిశ్రమలకు రుణాలందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం
‘ఇండిఫీ’ అనే రుణసంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక
సంస్థలతో చేతులు కలుపుతామని ప్రకటించింది. ఈ తరహా కార్యక్రమాన్ని భారత్‌లోనే
తొలిసారి ప్రారంభించడం విశేషం.
భారత్‌లో మొత్తం 200 పట్టణాల్లో రిజిస్టరయిన కంపెనీలకు ఈ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలందించనున్నట్లు సమాచారం. 17-20 శాతం వడ్డీరేటుగా నిర్ణయించారు. మహిళలకు వడ్డీరేటులో 0.2 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ ఇండియా ఎండీ, ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్ వెల్లడించారు. తద్వారా ఫేస్‌బుక్‌కి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు.
With @FacebookIndia’s new Small Business Loans Initiative, our partners can get access to timely credit. Thanks to @amitabhk87 & @ushanx for supporting us on our shared vision of helping small businesses drive big growth in India and around the world. https://t.co/I1BWLzLPdZ
— Ajit Mohan (@secondatticus) August 20, 2021
0 Komentar