GATE 2022 - Results Released
(గేట్)-2022: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) – ఫలితాలు విడుదల
UPDATE 17-03-2022
గేట్-2022 ఫలితాలు నేడు (మార్చి 17న) విడుదల అయ్యాయి. స్కోర్ కార్డ్ 21వ తేదీ నుండి
పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గేట్-2022 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ ఎన్‌ఐటీ
విద్యార్థి అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఎన్‌ఐటీ వరంగల్‌లో కెమికల్
ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మణి సందీప్‌రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో
మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నీట్ సంచాలకులు ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు
సందీప్‌రెడ్డిని అభినందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలేం
గ్రామానికి చెందిన తన్నీరు నిరంజన్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో 9వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
GATE 2022 Master Question Papers
& Answer Keys
Mr. T Mani Sandeep Reddy, final year BTech Chemical student secured AIR 1 in GATE 2022. pic.twitter.com/uGZBMab3VJ
— NIT WARANGAL (@warangal_nit) March 17, 2022
===================
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్ఏటీ)ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) - 2022 సంవత్సరానికిగాను నోటిఫికేషన్ వెలువడింది. దీనిని ఐఐటీ-ఖరగ్ పూర్ నిర్వహిస్తోంది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్
ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2022
అర్హత: గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఇంజినీరింగ్/
టెక్నాలజీ, ఆర్కిటెక్చర్/ సైన్స్/ కామర్స్/ ఆర్చ్) ఉత్తీర్ణత,
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 30.08.2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 24.09.2021.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: 03.01.2022.
గేట్ 2022 పరీక్ష తేదీలు: 2021, ఫిబ్రవరి 05 నుంచి 13 వరకు.
ఫలితాల వెల్లడి తేది: 17.03.2022.
0 Komentar