Google is changing the way you enter
OTPs on your PCs
మొబైల్ ఓటీపీ - క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్ ఓటీపీ పేరుతో గూగుల్ కొత్త ఫీచర్
ఆన్‌లైన్ లాగిన్ మరియు బ్యాకింగ్
లావాదేవీల కోసం ఓటీపీ తప్పనిసరి. అందుకే పీసీ లేదా కంప్యూటర్‌లో వీటికి సంబంధించిన
వ్యవహారాలు చక్కబెట్టేప్పుడు ఓటీపీల కోసం మొబైల్ ఫోన్ పక్కనే ఉంచుకుంటాం. ఓటీపీ
మెసేజ్ వచ్చిన వెంటనే దాన్ని ఎంటర్ చేసి పని పూర్తిచేస్తాం. ఇక మీదట కంప్యూటర్‌లో
ఓటీపీ ఎంటర్ చేసేందుకు మొబైల్ అవసరంలేదు. దీనికి సంబంధించి క్రోమ్ బ్రౌజర్‌లో
వెబ్ ఓటీపీ పేరుతో గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని సాయంతో మొబైల్ ఫోన్‌కి
వచ్చే ఓటీపీ మెసేజ్‌లు డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్‌లో చూడొచ్చు.
అలానే యూజర్ మొబైల్ ఫోన్‌కి
వచ్చిన ఓటీపీ మెసేజ్‌లను క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిగ్గా డిటెక్ట్ చేస్తుందని
సమాచారం. అయితే దీని కోసం యూజర్స్ తమ మొబైల్, కంప్యూటర్‌లో క్రోమ్
బ్రౌజర్ ఒకే గూగుల్ ఖాతాతో లాగిన్ కావాలి. అలానే యూజర్ ఉపయోగిస్తున్న వెబ్‌సైట్
వెబ్ ఓటీపీ సాంకేతికతను సపోర్ట్ చేయాలి. తొలుత ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్‌కి
మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారట. ఐఓఎస్ యూజర్స్ మరికొంత కాలం వేచి
చూడాల్సిందే. ఇప్పటికే కొంతమంది క్రోమ్ బీటా యూజర్స్ ఈ ఫీచర్‌ను పరీక్షించినట్లు
తెలుస్తోంది.
0 Komentar