Government Introduces BH Series
Registration Mark in Vehicles
Vehicle registration: కేంద్రం
శుభవార్త - రాష్ట్రం మారినా రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
కేంద్రం వాహన రిజిస్ట్రేషన్‌కు
సంబంధించి శుభవార్త చెప్పింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ
వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్’
(భారత్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం కింద
వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసే అవసరం తప్పుతుంది. ఈ మేరకు తాజాగా
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది.
కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు
కంపెనీలు/ సంస్థల ఉద్యోగులు (ఆయా కంపెనీలు నాలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తుండాలి)
ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది.
దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుందని
పేర్కొంది.
ప్రస్తుతం ఒక రాష్ట్రంలో
రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే
రాష్ట్రంలో ఉపయోగించే వీలుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం
నడపాలంటే వాహనాన్ని ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాలి. దీంతో చాలామంది
ఉద్యోగులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బీహెచ్
సిరీస్‌ను తీసుకొచ్చింది.
MORTH has introduced a new registration mark for new vehicles – Bharat series (BH-series). A vehicle with BH mark will not require a new registration mark when the owner shifts from one State to another.
— MORTHINDIA (@MORTHIndia) August 28, 2021
0 Komentar