ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు (05-08-2021)
1. ప్రశ్న:
Invalid Pension ఎప్పుడు
చెల్లిస్తారు?
సమాధానం:
ఒక ఉద్యోగి,అతను
చేస్తున్న ఉద్యోగము చేయలేడని మెడికల్ అధారిటీ డిక్లేరు చేస్తే అతనికి రూలు 45 లోబడి Invalid Pension మంజూరు చేస్తారు.అయితే
మెడికల్ అధారిటి ఉద్యోగి ఇప్పుడు చేస్తున్న పనికంటే తక్కువ శ్రమ కల్గిన
పనిచేయగలడు అని భావిస్తే అతనిని ఆ పోస్టులో నియమించవచ్చు.ఆ పని చేయడానికి అతనికి
ఇష్టం లేకపోతే అప్పుడు అతనికి Invalid Pension మంజూరు
చేస్తారు.
ఉద్యోగి దుర అలవాట్ల కారణంగా
అతనికి అనారోగ్యం సంభవిస్తే అతనికి Invalid Pension మంజూరు
చేయబడదు.
-------------------------------------------------
2. ప్రశ్న:
సర్వీసులో అంతరాయము వుంటే, పెన్సనుకు
అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?
సమాధానం:
సర్వీసులో అంతరాయము కలిగిన
కాలాన్ని పెన్సనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో
పరిగణిస్తారు.
(1) గైర్హాజరు కాలానికి
సెలవు మంజూరు చేసినప్పుడు
(2) సస్పెన్షన్ తర్వాత
తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు
(3) జాయినింగ్ టైము వినియోగించినప్పుడు
(4) పోస్టులు రద్దు
అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు
(5) పెన్షను మంజూరు అధికారి
వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు
--------------------------------------------------
3. ప్రశ్న:
సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల
సెలవుగా మంజూరు చేశారు. అంటే ఏమిటి?
సమాధానం:
సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్థ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా
జీతనష్టపు సెలవు.
-------------------------------------------------------
4. ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్ట పోతాను?
సమాధానం:
జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం
ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. మూడు సంవత్సరములు పైన జీత
నష్టపు సెలవు కాలం పెన్లన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు.
0 Komentar