Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (08-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలుసమాధానాలు (08-08-2021)

 

1. ప్రశ్న:

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా?

జవాబు:

జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు. ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.

---------------------------------------------------------

2. ప్రశ్న:

వేసవి సెలవులు మరియు వ్యక్తిగతంగా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది?

జవాబు:

జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.

----------------------------------------------------------

3. ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఐతే ఏమి చెయ్యాలి?

జవాబు:

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేయించి, DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించాలి. స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.

----------------------------------------------------------

4. ప్రశ్న:

నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా?

జవాబు:

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి, కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

-----------------------------------------------------------

5. ప్రశ్న:

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?

జవాబు:

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags