ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (10-08-2021)
1. ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న
జాబ్ లో చేరాడు. అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?
జవాబు:
ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే
ఇవ్వాలి.
------------------------------------------------------
2. ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి
మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా?
జవాబు:
Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి
సెలవు వాడుకోవచ్చు.
------------------------------------------------------
3. ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు?
జవాబు:
వేసవి సెలవులు 15
రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే, మొత్తం వేసవి సెలవులు
వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
-----------------------------------------------------
4. ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి
సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు?
జవాబు:
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
----------------------------------------------------
5. ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో
ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా?
జవాబు:
విరమించుకోవటానికి అతనికి అనుమతి
ఇవ్వరు.
0 Komentar