Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (11-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (11-08-2021)            

1. ప్రశ్న:

ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు?

జవాబు:

రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లు రావు. అయితే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేయవచ్చు.

--------------------------------------------------------------

2. ప్రశ్న:

CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు?

జవాబు:

ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.

--------------------------------------------------------------

3. ప్రశ్న:

స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?

జవాబు:

ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.

---------------------------------------------------------------

4. ప్రశ్న:

మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?

జవాబు:

జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.

---------------------------------------------------------------

5. ప్రశ్న:

CCL ఒకేసారి వాడుకోవచ్చా?

జవాబు:

మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు. 1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags