ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (13-08-2021)
1. ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్
వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??
జవాబు:
మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ
సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
-------------------------------------------------------
2. ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్
గా పొందవచ్చు??
జవాబు:
ఇంటి మరమ్మతులు, విస్తరణకు
ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు
గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.
--------------------------------------------------------
3.
ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
జవాబు:
వేసవి సెలవులు 15
రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు
వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
--------------------------------------------------------
4. ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి
సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??
జవాబు:
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
--------------------------------------------------------
5. ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో
ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??
జవాబు:
విరమించుకోవటానికి అతనికి అనుమతి
ఇవ్వరు.
0 Komentar