ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (15-08-2021)
1. ప్రశ్న:
Sir APGLI బాండ్లపై లోన్లు
ఇవ్వటానికి ఏమైనా పథకం ఉన్నదా ? ఎప్పుడు, ఎలా లోన్ బాండ్ పై తీసుకోవచ్చు? తెలుపగలరు.
జవాబు:
APGLI లో బాండ్స్ పై లోన్
ఏమి ఇవ్వరు. లోన్ ఫెసిలిటీ మాత్రం ఉంది.. APGLI Loan will be sanctioned
basing on the premiums paid. But not basing on the bond value (sum assured)
---------------------------------
2. ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన
మొత్తం డబ్బులపై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్
పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్
కార్డు zerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన డిపాజిట్
ల పైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీలో టాక్స్ కట్ చేస్తారు.
ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
----------------------------------
3. ప్రశ్న:
అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు
సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా? హాజరు
రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర
సందర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది: 23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000
సం.లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది: 20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు. వీరిలో ఎవరు సీనియరు?
జవాబు:
ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్
సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి
సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ
అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే
వరకు) ఒకే విధంగా ఉంటుంది. 2000సం.లో రంగారెడ్డి జిల్లాలోనే
నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.
---------------------------------
4. ప్రశ్న:
ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం,, స్కేలు, 24 సం,, స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి. అదే
విధంగా SA తన 12సం!! స్కేలు కోసం
ఏఏ Dept.Tests పాస్
కావాలి, మినహాయింపులు
ఏమైనా వున్నాయా?
జవాబు:
ఏ క్యాడర్ లో నైనా 18
సం,, స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు
అవసరంలేదు. 12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం,, ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది. SGT లు 24సం,, స్కేలు కోసం
గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి. SA
లకు తమ 12సం,, స్కేలు
కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొంది వుండాలి. అయితే Direct
Recruitment SA లకు మాత్రం 45సం,, వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి
మినహాయింపు కలదు. పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.
-------------------------------
5. ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్
ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?
జవాబు:
వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా
రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్
ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును.
అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక
చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)
0 Komentar