ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (19-08-2021)
1. ప్రశ్న:
ప్రొబెషన్ డిక్లేర్ చేయటానికి
ముందే రెగ్యులరైజేషన్ చేస్తారా? ప్రొబెషన్ డిక్లేర్ ఎలా చేస్తారు?
తెలుపగలరు.
జవాబు:
ప్రొబేషన్ డిక్లరేషన్ కి ముందుగా
సర్వీస్ రెగ్యులరిజేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కరే ఉద్యోగంలో చేరితే వారు చేరిన
తేదీనే సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తారు.
ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకాలు
పొందినపుడు వారి మెరిట్ లిస్ట్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం సర్వీస్ రెగ్యులరైజ్
చేయాల్సి ఉంటుంది.
నియామకాలు జరిగేటప్పుడు పలు
విడతలుగా నియామక పత్రాలు ఇచ్చి ఉండవచ్చు. అలాగే ఇచ్చిన సమయం లోపు ఎవరికి
నచ్చినప్పుడు వారు విధుల్లో చేరుతూ ఉంటారు.
అలాగే కొన్ని సార్లు ఇచ్చిన
నియామకాలను మార్చి వేరొక నియామకాలు చేసే పరిస్థితులు ఉంటాయి. ఎలా జరిగినా సరే ఒకే
నియామకం ద్వారా ఉద్యోగాలు పొందిన మెరిట్ ఆర్డర్ ప్రకారమే వారి సీనియారిటీ
కొనసాగాలి. సీనియారిటీ మీ ప్రాతిపదిక సర్వీస్ రెగ్యులరైజేషన్ తేదీ.
----------------------------------------------------------------
2. ప్రశ్న:
Hysterectomy leave తీసుకున్న
వాళ్ళు ప్రమోషన్ లో వెనుకపడ్తారా వాళ్ళు మెరిట్ లాస్ అవుతారా? దయచేసి తెలుపగలరు.
జవాబు:
G.O.Ms.No:52 తేదీ: 01-04-2011 ప్రకారంగా 45 రోజుల సెలవు ఇవ్వబడుతుంది. కనుక
వారికి ప్రమోషన్/ సీనియారిటీ లాస్ అవ్వదు.
----------------------------------------------------------------
3. ప్రశ్న:
సర్, LTA అనగా ఏమిటి?
అది ఎవరికి ఉపయోగం? ఎవరు దాని డేటాను చేపడతారు?
తెలుపగలరు.
జవాబు:
LTA means LIFE TIME AREARS. ఉద్యోగి సర్వీస్ లో ఉండగా చనిపోతే, ఆ ఉద్యోగికి
రావాల్సిన బకాయిలు భార్యకు/కుటుంబ సభ్యులకు/నామినీకి చెల్లించాల్సినపుడు ఈ ఆప్షన్
ఉపయోగిస్తారు. DDO లు అట్టి బాద్యత లీగల్ హైర్ సర్టిఫికేట్
ఆధారంగా చేస్తారు.
---------------------------------------------------------
4. ప్రశ్న:
ప్రమోషన్ కౌన్సెలింగ్ లో spouse గ్రౌండ్స్ avail చేసుకోవచ్చునా? అలా అవైల్ చేసుకోవచ్చు అనే go కానీ రూల్ పొజిషన్
కానీ ఉంటే కొంచెం తెలియజేయండి.
జవాబు:
ప్రొమోషన్ పొందటానికి అయితే spouse సర్టిఫికెట్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రొమోషన్ వచ్చే వాళ్లకి పోస్టింగ్స్
లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండవచ్చు.
ప్రొమోషన్ సందర్భంగా ఇచ్చే పోస్టింగ్స్
కి సాధారణ విధి విధానాలు ఏమీ లేవు. ఎవరికీ ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధిత
అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది.
అయితే ఎక్కువ ఉద్యోగులు ఉండే
కొన్ని శాఖలు ఈ విషయంలో వివాదాలు ఏర్పడకుండా కౌన్సిలింగ్ విధానాన్ని
ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు ఇచ్చే మార్గదర్శకాలను ఫాలో కావాల్సి ఉంటుంది.
0 Komentar