ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (23-08-2021)
1. ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??
జవాబు:
ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు
జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.
-------------------------------------------------
2. ప్రశ్న::
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో
ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
జవాబు:
మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం
ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే
చెల్లించబడుతుంది.
--------------------------------------------------
3. ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6
నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా
ఇవ్వాలి.
జవాబు:
APLR 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే
లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3
ELs జమ చేయకూడదు.
---------------------------------------------------
4. ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్
ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse
కేటగిరీ గా పరిగణిస్తున్నారు.
--------------------------------------------------
ప్రశ్న:
ఫిబ్రవరి 29న
విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి
ఇవ్వాలి?
జవాబు:
మార్చి1 నుండి
ఇవ్వాలి. AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్
సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.
0 Komentar