ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (01-08-2021) (AP&TS)
1. ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్
మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?
జవాబు:
వీటిని 98
వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 1.7.98 నుండి
అమలు చేశారు. 1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు
వర్తిస్తాయి.
--------------------------------------
2. ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే
విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?
జవాబు:
కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థలకి 50% పన్ను మినహాయింపు
వర్తిస్తుంది.
--------------------------------------
3. ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో
కలిపి వాడుకోవచ్చునా?
జవాబు:
FR.101(ఎ)ప్రకారం మెడికల్
సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.
--------------------------------------
4. ప్రశ్న:
పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్
పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా?
జవాబు:
మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి
మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది. 2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు. ఇద్దరు పిల్లలకి
మాత్రమే వర్తిస్తుంది.
------------------------------------
5. ప్రశ్న:
OH, ఆదివారాలను కూడా suffix,
prefix గా వాడుకోవచ్చా?
జవాబు:
మెమో.86595, తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.
---------------------------------
6. ప్రశ్న:
TSGLI ప్రీమియం అదనంగా
చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా?
జవాబు:
జీఓ.26
తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా
చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించేవారు గుడ్ హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వవలసి
ఉంటుంది.
-------------------------------
7. ప్రశ్న:
మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు
ఎప్పట్లోగా dse కి పంపాలి?
జవాబు:
హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన
తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.
--------------------------------
8. ప్రశ్న:
నాకు 20
ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను.
నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?
జవాబు:
క్వాలిఫై సర్వీసుకి 61
ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు. ఐతే దీని
గరిష్ట పరిమితి 5 ఇయర్స్.
-------------------------
9. ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ,
ఉర్దూ ఎవరు రాయాలి?
జవాబు:
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక
భాషగా చదవని వారు తెలుగు (కోడ్--37) రాయాలి. అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.
0 Komentar