ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు –
సమాధానాలు (28-08-2021)
1. ప్రశ్న:
ఒక ఉపాద్యాయుడు తాను సోమవారం రాను
అని శనివారం ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసి CL వేయమని కోరడం జరిగింది..
కాని కొన్ని కారణాల వల్ల అతడు తిరిగి సోమవారం స్కూల్ వెళ్లాలనుకొని ఉదయం స్కూల్
టైం కు ముందే సమాచారం అందిచాడు.. కాని శనివారం రోజే సోమవారం నాడు CL అని అడ్వాన్స్ గా అటెండెన్స్ రిజిస్టర్ లో వేయవచ్చా.?
జవాబు:
వేయకూడదు. CL కు ముందస్తుగా దరఖాస్తు చేసుకొన్నప్పటికీ CL గ్రాంట్
చేసినా మరుసటిరోజు పాఠశాల సమయంలో మాత్రమే అటెండెన్స్ రిజిస్టర్ నందు నమోదు
చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సారి వారు CL క్యాన్సిల్
చేసుకోవచ్చు
===================================
2.ప్రశ్న:
ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని
రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి?
జవాబు:
జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం
సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా
వాడుకోవచ్చు.
===================================
3. ప్రశ్న:
ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై
అధికారి అనుమతి తీసుకోవాలా?
జవాబు:
అవును. ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి
అనుమతి తప్పకుండా తీసుకోవాలి.
====================================
4. ప్రశ్న:
ఒక SGT వేరే DSC
లో SA గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?
అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా?
జవాబు:
మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి
మాత్రం రక్షణ ఉండదు. SA గా చేరిన సంవత్సరంకు మాత్రమే
ఇంక్రిమెంట్ ఇస్తారు.
====================================
5. ప్రశ్న:
నేను త్వరలో రిటైర్మెంట్
కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా?
జవాబు:
పెన్షన్ ను ఆదాయంగా చూపాలి.
గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాధిత సెలవు నగదుగా
మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.
====================================
6. ప్రశ్న:
నేను బదిలీ అయ్యాను. పాత మండలంలో
చాలా ఎంట్రీలు వేయలేదు. ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు. ఆ
ఎంట్రీల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి?
జవాబు:
సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.
0 Komentar