ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు –
సమాధానాలు (31-08-2021)
◼◼◼◼◼◼◼◼◼◼
1. ప్రశ్న:
నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను. B. Com పాస్ అయ్యాను. B.Ed లేదు. నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా??
జవాబు:
24 ఇయర్స్ స్కేల్ పొందాలి
అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.
====================================
2. ప్రశ్న:
నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు. పెరిగిన DA తేడా
ఇవ్వరా??
జవాబు:
FAC కాలానికి, సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.
====================================
3. ప్రశ్న:
ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఇంక్రిమెంట్
ఆపారు. అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు ఈ కాలాన్ని కూడా
పరిగణనలోకి తీసుకోవచ్చా??
జవాబు:
మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల
కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.
====================================
4. ప్రశ్న:
నేను శనివారం, సోమవారం
సెలవు పెట్టాలి. రెండు CL లెటర్లు ఇవ్వాలా??
జవాబు:
అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి
ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.
====================================
5. ప్రశ్న:
APGLI నుండి పొందిన ఋణానికి
వడ్డీ చెల్లించాలా??
జవాబు:
ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ
కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.
0 Komentar