HDFC Life: Know about New HDFC Life's ‘Saral
Pension’ Policy
సరళ్ పెన్షన్ ప్లాన్‌ను లాంచ్
చేసిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ – ముఖ్యమైన వివరాలు ఇవే
జీవిత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. సరళ్ పెన్షన్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. సింగల్ ప్రీమియం, నాన్-లింకెడ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్ ఇది. కొనుగోలు చేసిన సమయం నుంచి జీవిత కాలం ఖచ్చినమైన పెన్షన్‌ను అందిస్తుంది.
యాన్యూటీ ప్లాన్లు రైటర్‌మెంట్‌కు చేరువైన లేదా రిటైర్ అయిన వ్యక్తులకు సరిపోతాయి. మార్కెట్ హెచ్చు తగ్గులు, పడిపోతున్న వడ్డీ రేట్ల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సరళ్ పెన్షన్ ప్లాన్.. స్టాండర్డ్, ఇండివిడ్యువల్, ఇమిడియేట్ యాన్యూటి ప్రాడక్ట్.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సరళ్ పెన్షన్
ప్లాన్ ఫీచర్లు..
* వైద్య పరీక్షలు
చేయించుకోవాల్సిన అవసరం లేదు
* ప్రీమియం మొత్తం ఒకేసారి
చెల్లించాలి.
* జీవిత కాలం హామీ ఇచ్చిన
మొత్తం ఆదాయంగా అందుతుంది.
* పాలసీ తీసుకున్న వ్యక్తి
జీవిత భాగస్వామి లేదా పిల్లలు పాలసీలో తెలిపిన క్లిష్టమైన వ్యాధుల బారిన పాటినట్లు
గుర్తిస్తే పాలసీని సరెండర్ చేసే వీలుంది.
* మరణిస్తే కొనుగోలు ధరను
తిరిగి చెల్లిస్తారు.
* కొనుగోలు ధర పెరిగే
కొద్ది యాన్యూటీ ప్రయోజనం కూడా పెరుగుతుంది.
* పాలసీపై రుణం తీసుకునే
సదుపాయమూ ఉంది.
* యాన్యూటీని ఎన్ని నెలలకు
చెల్లించాలి (నెలవారిగా, మూడు నెలలకు, ఆరు నెలలకు, వార్షికంగా) అనేది పాలసీదారుడు ఎంపిక
చేసుకోవచ్చు.
* జీవిత భాగస్వామికి ప్రయోజనాలను కొనసాగించాలనుకునేవారు జాయింట్-లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Very useful
ReplyDelete