Herbal drug NEERI-KFT can help damaged
kidney recover: Study
మూత్రపిండాల వ్యాధికి ఆయుర్వేద
విరుగుడు
- నీరి-కేఎఫ్‌టీతో ఉపశమనం
ఆయుర్వేద ఔషధం ‘నీరి-కేఎఫ్‌టీ’తో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఇది దీర్ఘకాల కిడ్నీ రుగ్మత ఉద్ధృతిని నెమ్మదింపచేయడమే కాకుండా ఈ అవయవం మునుపటిలా ఆరోగ్యంగా పనిచేసేందుకూ వీలు కల్పిస్తుందని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘సౌదీ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్’లో ప్రచురితమయ్యాయి. భారత్‌కు చెందిన ఏఐఎంఐఎల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ నీరి-కేఎఫ్‌టీని ఉత్పత్తి చేస్తోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) అనే దీర్ఘకాల రుగ్మతపై దీని ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ మందు.. ఆక్సిడేటివ్, ఇన్‌ఫ్లమేటరీ ఒత్తిడి వల్ల కణాలు మృతి చెందడాన్ని నిలువరిస్తుందని గుర్తించారు.
ఔషధాల కారణంగా మూత్రపిండాల్లో
తలెత్తే విషతుల్యతను తగ్గించడం, రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం,
యాంటీఆక్సిడెంట్లను విడుదల చేయడం ద్వారా ఇలాంటి ఫలితాన్ని
అందిస్తుందని తేల్చారు. సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా,
సీరం యూరిక్ యాసిడ్ వంటి వాటి స్థాయినీ ఈ ఔషధం తగ్గిస్తుందని
పరిశోధకులు తెలిపారు. పరీక్షార్థుల్లో దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని
చెప్పారు. మూత్రపిండాలు పూర్తి స్థాయిలో విఫలమై, తరచూ
డయాలసిస్ చేయించుకోవాల్సిన వారికి ప్రత్యామ్నాయ, అనుబంధ
చికిత్సగా నీరి-కేఎఫ్‌టీని సూచించవచ్చని పేర్కొన్నారు.
ఈ ఔషధంలో ఉన్న 20కిపైగా
మూలికల వల్ల ఈ ప్రభావం కలుగుతోందని ఏఐఎంఐఎల్ ఎండీ కె.కె.శర్మ తెలిపారు. ఈ మందులో
అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధులను నయం చేసే గుణాలు
ఉన్నాయని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
ఆచార్యుడు కె.ఎన్.ద్వివేది పేర్కొన్నారు. వీటివల్ల మూత్రపిండాలకే కాక
కాలేయానికీ ప్రయోజనం కలుగుతుందన్నారు.
0 Komentar