India at Olympics: ఒలింపిక్స్
చరిత్రలో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు వీరే - అత్యధిక పతకాలు
టోక్యో లోనే
======================
టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత్ కు
పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 2
రజతాలు, 4 కాంస్యాలతో సహా మొత్తం 7 మెడల్స్ ఉన్నాయి.
ఒలింపిక్స్‌లో ఇండియా సాధించిన అత్యధిక మెడల్స్ ఇవే కావడం విశేషం.
ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రత్యేక స్థానముంది. దాదాపు రెండు వందల దేశాలు పాల్గొనే ఈ క్రీడల్లో పతకాలు గెలవడం అంత సులభం కాదు. అయినా.. ఈ మెగా పోటీల్లో భారత్ తనదైన ముద్ర వేస్తూ పతకాలు సాధిస్తోంది. కాగా.. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలు సాధించింది. మరి వాటిని ఎప్పుడు, ఏ క్రీడలో సాధించిందో ఓ సారి చూద్దాం..!
పారిస్ ఒలింపిక్స్ 1900 లో 2 రజతాలు
1896లో ఆధునిక ఒలింపిక్స్
ప్రారంభం కాగా.. 1900లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన
రెండో ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్ తరఫున బ్రిటీష్ ఇండియన్ అయిన నార్మన్
ప్రిట్జార్డ్ ఒక్కరే ప్రాతినిథ్యం వహించారు. ఐదు విభాగాల్లో నార్మన్ పాల్గొనగా..
మెన్స్ 200 మీటర్స్, మెన్స్ 200 మీటర్లు హర్డల్స్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలు
సాధించారు. అయితే, ఆ పతకాలు బ్రిటీష్‌కు చెందుతాయని కొన్ని
వాదనలు ఉండేవి. కానీ, చివరికి ఒలింపిక్స్ కమిటీ ఆ పతకాలు
భారత్‌విగా పరిగణించాలని నిర్ణయించింది.
బెల్జియం ఒలింపిక్స్ 1920- పారిస్ ఒలింపిక్స్ 1924
బ్రిటీష్ ఇండియన్ కాకుండా
భారతీయులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం మాత్రం 1920 నుంచే ప్రారంభమైంది.
భారత్ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనేలా చేయడంలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త
సర్ దొరబ్జీ టాటా చొరవ తీసుకున్నారు. దీంతో ఒలింపిక్స్ కమిటీ భారత్‌కు
గుర్తింపునిచ్చింది. అలా 1920లో ఆరుగురు అథ్లెట్లు,
1924లో 14 మంది అథ్లెట్లతో ఒలింపిక్స్ బరిలో
దిగిన భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ రెండు ఒలింపిక్స్‌లోనూ భారత ఆటగాళ్లు ఉట్టి
చేతులతో తిరిగొచ్చారు.
ఒలింపిక్స్ 1928 - 1980
ఒలింపిక్స్ చరిత్రలో 1928 నుంచి 1980 వరకు భారత్‌కు స్వర్ణయుగంగా చెప్పొచ్చు. 1928లో ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ ప్రాతినిథ్యం వహిస్తున్న హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్‌కు పసిడి పతకం తెచ్చిపెట్టింది. 1932లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్ జట్లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆఖరి పోరులో నెదర్లాండ్‌తో పోటీ పడ్డ భారత్ 3-0తో ఘన విజయం సాధించి స్వర్ణం పతకం సాధించింది. 1936లో జర్మనీపై 8-1 తేడాతో గెలిచి వరుసగా హ్యాట్రిక్ స్వర్ణాలు దక్కించుకుంది భారత్.
రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1940, 1944 ఒలింపిక్స్ రద్దయ్యాయి. ఆ తర్వాత 1948లో లండన్
ఒలింపిక్స్, 1952లో హెల్సెంకీ ఒలింపిక్స్, 1956లో మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లోనూ భారత హాకీ జట్టు స్వర్ణ పతకాల గెలుపు
పరంపరను కొనసాగించింది. 1952 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో
ఖషబా దాదాసాహెబ్ జాదవ్ కాంస్య పతకం సాధించడం విశేషం. నార్మన్ గెలిచిన రజతం,
హాకీ జట్టు తెచ్చిన పతకాలు కాకుండా మరో విభాగంలో పతకం సాధించడం అదే
తొలిసారి. ఇక 1960లో రజతం సాధించిన హాకీ జట్టు.. 1964లో స్వర్ణం.. 1968, 1972లో కాంస్య పతకాలతో
సరిపెట్టుకుంది. 1980లో మళ్లీ స్వర్ణం దక్కించుకున్న హాకీ
జట్టు.. ఆ తర్వాత పట్టు తగ్గుతూ వచ్చింది. ఇక 1984, 1988, 1992 ఒలింపిక్స్‌లో అథ్లెట్ల సంఖ్య పెరిగినా ఒక్క పతకం కూడా భారత్‌కు రాలేదు.
1996 నుంచి భారత్ దశ మారింది.. వివిధ విభాగాల్లో పతకాలు సాధించడం మొదలైంది. 1996 నుంచి 2020 వరకు పతకాలు గెలిచింది వీరే..👇
0 Komentar