'India May Be Entering Endemic Stage of
Covid': WHO Chief Scientist
భారత్‌లో ‘ఎండెమిక్’ దశకు కొవిడ్ - డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సెప్టెంబరు మధ్యలో కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో
ఆమోదం
భారత్‌లో కొవిడ్ ఓ మోస్తరు
స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్) దశలోకి మారుతున్నట్లు
కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్
సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు మధ్య నాటికి భారత్ బయోటెక్
‘కొవాగ్జిన్’ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక బృందం ఆమోదం తెలిపే అవకాశం
ఉందన్నారు.
ఓ న్యూస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. 2022 ఆఖరు నాటికి.. 70% వ్యాక్సినేషన్ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
పిల్లల్లో కొవిడ్ వ్యాప్తిపై మాట్లాడుతూ ఈ విషయమై తల్లిదండ్రులు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు కొవిడ్ సోకినప్పటికీ వ్యాధి అతి
స్వల్పంగానే ఉంటుందని.. తక్కువ శాతం మంది మాత్రమే అనారోగ్యం బారిన పడే అవకాశం
ఉంటుందన్నారు. పెద్దవారితో పోలిస్తే మరణాలు చాలా తక్కువే ఉంటాయని చెప్పారు.
0 Komentar