iPhone 13 Will Use LEO Satellite
Communication to Enable Voice Calls, Messages Without Cellular Coverage
iPhone 13: ఐఫోన్ 13లో శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఫీచర్ - మిగతా ఆసక్తికరమైన వివరాలు ఇవే
iPhone 13: ఈసారి కూడా యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడల్ ఐఫోన్ 13ను సెప్టెంబరు 14న తీసుకురానుదంట. ఈ మేరకు ఐఫోన్ 13 విడుదలపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐఫోన్ 12 తరహాలోనే ఐఫోన్ 13లో కూడా నాలుగు వేరియంట్లు ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల విశ్లేషకుడు మింగ్ చి కువో ఐఫోన్ 13 గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఐఫోన్ 13లో శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంటే సాధారణ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఐఫోన్ 13 నుంచి శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చని మింగ్ వెల్లడించారు. అలానే తక్కువ ఎత్తులోని భూమి కక్ష్య(ఎల్‌ఈవో)లో కూడా శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఐఫోన్ 13లో క్వాల్‌కోమ్ ఎక్స్60 మోడెమ్ ఉపయోగించినట్లు తెలిపారు.
ఇందుకోసం యాపిల్ సంస్థ స్పేస్‌ఎక్స్
కంపెనీతో జట్టుకట్టినట్లు వెల్లడించారు. త్వరలో ఇదే తరహా సేవలను అందించేందుకు
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌తోపాటు స్టార్‌లింక్, గ్లోబల్‌స్టార్
వంటి సంస్థలు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. శాటిలైట్ కనెక్టివిటీ కోసం యాపిల్
ఆయా దేశ ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకొనుందట. ఐఫోన్ 13లో
ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. అలానే ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 13 మినీలో 5.4-అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌లో 6.1-అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. వీటిని 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌పీవో డిస్‌ప్లేతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 మినీలో 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13, 13 ప్రో వేరియంట్లో 3,095 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లో 4,352 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందట.
ఈ ఫోన్లలో వెనుకవైపు మూడు కెమెరాలు
ఇస్తున్నారని తెలుస్తోంది. వీడియో రికార్డింగ్‌లో కూడా పొట్రెయిట్ మోడ్
తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇది ఫొటోలు లేదా వీడియోలు తీసేప్పుడు కెమెరాలోని
డెప్త్ సెన్సర్ ఫొటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసి సబ్జెక్ట్‌ని హైలెట్
చేస్తుందట. అలానే సులువుగా ఎడిట్ చేసుకునేందుకు , హైక్వాలిటీ
వీడియోలను రికార్డు చేసేందుకు ప్రో రెస్ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నారట.
వీటితోపాటు ఫొటోలో మనకు అవసరమైనచోట మాత్రమే ఉపయోగించేలా కొత్త తరహా ఫిల్టర్స్
పరిచయం చేస్తున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి.
0 Komentar