JEE Main 2021: April Session Results Released
జేఈఈ మెయిన్-2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ మూడో విడత ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యాయి. తుది కీని
జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టిఏ) ఆగస్టు 5న ఖరారు చేసింది.
దేశవ్యాప్తంగా జులై 20, 22, 25, 27 తేదీల్లో పేపర్-1,
2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 7.09 లక్షల మంది దరఖాస్తు చేయగా దాదాపు 6.50 లక్షల మంది
పరీక్షలు రాశారు. వారికి పర్సంటైల్ స్కోర్ ఇవ్వనున్నారు.
చివరి విడత పరీక్షలు ఆగస్టు 26వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. అవి ముగిసిన తర్వాత ర్యాంకులు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి 300 మార్కులకు 300 వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే వారికి 100 పర్సంటైల్ స్కోర్ వచ్చినట్లే.
0 Komentar