Kotak Bank's Debit cardholders can now
buy everything on EMI – Details Here
కొటక్ మహీంద్రా బ్యాంక్: డెబిట్
కార్డు చెల్లింపులనూ ఈఎంఐగా మార్చుకోవచ్చు – వివరాలు ఇవే
డెబిట్ కార్డుతో చేసే వ్యయాన్ని కూడా సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ) కిందకు మార్చుకోవచ్చు. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో చేసే అన్ని రకాల ఖర్చులను ఈఎంఐ కిందకు మార్పించుకునే సదుపాయాన్ని అందజేస్తోంది. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి(బై నౌ-పే లేటర్)’ పద్ధతిని మరింత విస్తృతపరచడంలో భాగంగానే ఈ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. దీంతో ఈ బ్యాంకు ఖాతాదారులు ఇకపై ఎక్కడైనా.. ఏదైనా.. కొని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని ఎలా పొందాలి...
* ఏదైనా స్టోర్‌లో కొటక్
బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయగానే మీ ఫోన్‌కు ఓ లింక్‌తో కూడిన
సందేశం వస్తుంది.
* ఆ లింక్‌పై క్లిక్ చేసి
మీ చెల్లింపు వివరాలను సరిచూసుకోవాలి. అక్కడే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంపిక చేసుకొని
కాలపరిమితిని తెలియజేయాలి.
* వెంటనే ఆ లావాదేవీ మొత్తం
ఈఎంఐ కిందకు మారుతుంది.
* ప్రక్రియ పూర్తయిన కొద్ది
సేపట్లోనే మీరు ఖర్చు చేసిన మొత్తం ఖాతాలో జమవుతుంది.
* రూ.ఐదు వేలు అంతకంటే
ఎక్కువ లావాదేవీలను మాత్రమే ఈఎంఐ కిందకు మార్చుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రత్యేక
డెబిట్ కార్డుల్లో మాత్రమే లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకునే సదుపాయం ఉండేది.
అదీ కొన్ని పరిమిత స్టోర్లలో మాత్రమే. కానీ, తాజాగా కొటక్ మహీంద్రా
బ్యాంక్ తీసుకొచ్చిన ఈ సదుపాయంతో కొటాక్ డెబిట్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ..
అన్ని రకాల స్టోర్లలో చేసే ఖర్చును ఈఎంఐగా మార్చుకోవచ్చు.
0 Komentar