Ola Electric Scooter S1 Launched: Price,
Features and Availability Details Here
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1:
ధర, ఫీచర్లు మరియు మిగతా ముఖ్యమైన వివరాలు ఇవే
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ
`సీఈఓ` భవిష్ అగర్వాల్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేశారు.
ఓలా స్కూటర్ కీలెస్ వంటి కొన్ని
సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. స్కూటర్‌లో రివర్స్ మోడ్ (వెనక్కి
తీసుకోవడం) లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1
మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో
మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్
ఈవెంట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్
స్కూటర్లకు పోటీ ఇచ్చే విధంగా ఈ స్కూటర్క్ ధర ఉంది.
ప్రత్యేకతలు:
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1,
S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది.
- S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్‌ఈడీ లైటింగ్ అధునాత
ఫీచర్లు అందిస్తోంది.
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
పది రంగుల్లో లభిస్తోంది.
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90, ఫుల్
ఛార్జ్ చేస్తే 121 కి.మీల దూరం వెళ్లనుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.
- ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ.
ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.
- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్
కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
- లక్షకు పైగా ప్రీ
బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఓలా మెగా ఫ్యాక్టరీ
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం
డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన
కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్‌లైన్‌లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి
వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే.
- 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్‌ని
తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది.
- తమిళనాడులో ఉన్న ఓలా మెగా
ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి.
ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా
ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి.
- స్కూటర్ సింపుల్ వన్, బజాజ్
చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా
కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్‌లో ఉన్నాయి.
ఓలా
ఎలక్ట్రిక్ స్కూటర్ VS సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
Simple
One Electric Scooter: ఒకసారి ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్లు
0 Komentar