82 ఏళ్ల వయసులో అరుదైన ఘనత సాధించి
‘ఔరా’ అనిపించుకున్నారు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎంసీ.పుల్లయ్య. ఉన్నత
విద్యాభ్యాసం చేయలేక పోయాననే వెలితి వెన్నాడుతుండటంతో.. ఉద్యోగ విరమణ అనంతరం తన కల
నెరవేర్చుకున్నారు ఆయన.
నంద్యాల పట్టణం కురవపేటకు చెందిన
ఎంసీ.పుల్లయ్య 1940 జులై 1న జన్మించారు. పీయూసీ
చదివిన వెంటనే 21 ఏళ్ల ప్రాయంలో పంచాయతీ సమితిలో ఎల్‌డీసీగా
ఉద్యోగం వచ్చింది. 1998 జూన్ 30న
పంచాయతీరాజ్‌శాఖలో సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
కుమారుడు, కుమార్తెల
చదువులు పూర్తయినా చదవాలనే కోరిక బలంగా ఉండటంతో 2012లో నంద్యాలలోని
డా.బీఆర్.అంబేడ్కర్ దూర విద్య అధ్యయన కేంద్రంలో బీఏలో చేరారు. 2018 నాటికి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం దూర విద్యలో ఎంఏ తెలుగు
సాహిత్యంలో ప్రవేశం పొందారు. ఈ ఏడాది జులై 12న ఫలితాలు రాగా
ఉత్తీర్ణత సాధించారు. పీజీ పూర్తి చేసే నాటికి పుల్లయ్య వయసు 82 ఏళ్లు.
0 Komentar