POWERGRID Recruitment 2021 –
Notification for 137 Field Engineers and Field Supervisor Posts
పవర్ గ్రిడ్ లో 137 ఫీల్డ్
ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి
మంత్రిత్వ శాఖకి చెందిన మహారత్న సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 137
1) ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్):
48
2) ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్) : 17
3) ఫీల్డ్ సూపర్వైజర్
(ఎలక్ట్రికల్): 50
4) ఫీల్డ్ సూపర్‌వైజర్ (సివిల్):
22
అర్హత: కనీసం 55శాతం మార్కులతో
ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/
బీఎస్సీ(ఇంజినీరింగ్)/ బీఈ(పవర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. ఫీల్డ్ సూపర్ వైజర్
పోస్టులకి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్
డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 27.08.2021 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: ఫీల్డ్ ఇంజినీర్లకి
నెలకి రూ.30000 నుంచి రూ.120000, ఫీల్డ్
సూపర్వైజర్లకి నెలకి రూ.23000 నుంచి రూ.105000 లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్
(టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్
పోస్టులకి రూ.400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకి రూ.300 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
13.08.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 27.08.2021.
0 Komentar