Hon'ble President of India Address to
the Nation on the eve of Independence Day
భారత రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం – ముఖ్యమైన వివరాలు ఇవే
కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ
ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో అనేకమంది ప్రాణాలు
కోల్పోవడం కలచివేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ
రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన
క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని
పోత్సహించినట్టు తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని
ఎన్నటికీ మరచిపోలేమన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య
వసతులు కల్పించామన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్ వేవ్‌పై
పైచేయి సాధించగలుగుతున్నామన్నారు.
కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో
పురోగతి సాధించామన్నారు. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు
తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఆయారంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన
చర్యలు చేపడుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. సులభతర జీవనం,
వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్రపతి వివరించారు.
0 Komentar