Rare Blue Moon to Appear Today: Check
Details Here
బ్లూమూన్: నేడు
ఆకాశంలో స్పష్టంగా ఉండే నీలిరంగు చంద్రుడిని వీక్షించండి
Timings: నేడు రాత్రి
ఆకాశంలో అద్బుతం చోటుచేసుకొనుంది. మన సమీప ఉపగ్రహమైన చంద్రుడు నేడు రాత్రి నీలి
వర్ణంలో కనువిందు చేయనున్నాడు. నేడు ఆకాశంలో స్పష్టంగా ఉండే నీలిరంగు చంద్రుడిని చూడవచ్చునని
అమెరికన్ ఆస్ట్రోనామికల్ సోసైటి వెల్లడించింది. స్కై అండ్ టెలిస్కోప్
మ్యాగజైన్ ప్రకారం ప్రతి 2.7 సంవత్సరాలకు ఒకసారి నీలిరంగులో
చంద్రుడు కన్సించనున్నాడు. భారత్‌లో ఈ ఖగోళ అద్భుతాన్ని రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో చూడవచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మరల ఈ బ్లూమూన్ చూడాలంటే 2024 ఆగస్టు వరకు వేచి చూడాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా బ్లూమూన్
తొలిసారిగా 1528 సంవత్సరం నుంచి గమనించడం మొదలు పెట్టింది.
సాధారణంగా ఒక సీజన్‌లో మూడు పౌర్ణములు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నాలుగు
పౌర్ణములు కూడా ఉంటాయి.. ఈ నాలుగు పౌర్ణములు ఉన్న సమయంలో వచ్చే మూడో పౌర్ణమిని
బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా,
మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.ఒక నెలలో రెండు పౌర్ణములు
వస్తే అందులో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు.
🌕 Go outside and observe the full Moon, & share your photos with us! From tonight into Sunday morning, the bright planet Jupiter will appear near the full Moon. It's the third full Moon in a season with four, which some call a Blue Moon: https://t.co/vmXClH3Z0l
— NASA (@NASA) August 21, 2021
📸: @NASAHQPhoto pic.twitter.com/arvbbhCs6t
0 Komentar