SBI Gold Loan: Discounts on Gold Loans –
Apply using SBI YONO – Details Here
గోల్డ్ లోన్ వడ్డీపై డిస్కౌంట్ ఆఫర్
చేస్తున్న ఎస్‌బీఐ.. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఎలా అప్లై చేయాలి?
ఎమర్జెన్సీ లో డబ్బు అవసరమైతే, రుణం
పొందేందుకు ఉన్న సురక్షితమైన, సులభమైన మార్గాలలో ఒకటి
గోల్డ్ లోన్. బంగారు ఆభరణాలు, బ్యాంకు వద్ద నుంచి
కొనుగోలు చేసిన నాణాలపై కొద్దిపాటి పేపర్ వర్క్‌తో, తక్కువ
వడ్డీ రేటుతో బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. వడ్డీ రేటు బ్యాంకును బట్టి
మారుతుంటుంది. 7 శాతం నుంచి 29 శాతం వరకు
ఉండొచ్చు. ఎస్‌బీఐ కూడా బంగారంపై రుణాలను
ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వడ్డీరేటుపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు
ప్రకటించింది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే.
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు
చేస్తే చేకూరే ప్రయోజనాలు..
1. ఇంటి నుంచి దరఖాస్తు
చేసుకోవచ్చు.
2. వడ్డీ రేటు 8.25 శాతం (0.75 శాతం రాయితీ అందుబాటులో ఉంది. ఈ రాయితీ 30.09.2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.)
3. తక్కువ పేపర్ వర్క్
4. తక్కువ ప్రాసెసింగ్
టైమ్
5. బ్రాంచిలో ఎక్కువ సమయం
వేచివుండనవసరం లేదు.
ఎలా పొందాలి..
* ముందుగా లోన్ కోసం దరఖాస్తు
చేసుకోవాలి. ఇందుకోసం ఎస్‌బీఐ యోనో యాప్ అక్కౌంటుకు లాగిన్ అయ్యి, హోమ్ పేజిలో ఎడమ వైపు పైభాగంలో ఉన్న మెనూ (మూడు లైన్లు)పై క్లిక్ చేయాలి.
అక్కడ అందుబాటులో ఉన్న లోన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. ఏ లోన్ కావాలో
అడుగుతుంది. గోల్డ్ లోన్‌పై క్లిక్ చేసి అప్లై నౌను క్లిక్ చేయాలి.
* ఇక్కడ హామీగా ఉంచే నగల
వివరాల (నగ రకం, బరువు, కేరెట్,
నికర బరువు) ను పొందుపరచాలి. డ్రాప్‌డౌన్ మినూలో అడిగిన వివరాల(నివాసం,
వృత్తి వంటివి)ను కూడా తెలియజేయాలి.
* తాకట్టు పెట్టాల్సిన
బంగారంతో పాటు, రెండు ఫోటోలు, కేవైసీ పత్రాలతో
బ్యాంకుకు వెళ్లాలి. డాక్యుమెంట్ల మీద సంతకం చేసి రుణం పొంవచ్చు.
ఎవరు తీసుకోవచ్చు? ఎంత
ఇస్తారు?
18 సంవత్సరాలు పైబడి వయసు
ఉండి, క్రమానుగత ఆదాయం ఉన్న వారు లోన్ తీసుకోవచ్చు. అదే
విధంగా ఫించను దారులు కూడా బంగారంపై రుణాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని
ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీస రుణ మొత్తం రూ.20వేలు గరిష్టంగా
రూ.50 లక్షల వరకు ఇస్తారు.
కావలసిన పత్రాలు..
* దరఖాస్తు పత్రం
* అడ్రస్ వివరాలతో కూడా గుర్తింపు
కార్డు
* రెండు ఫోటోలు
ఇతర వివరాలు..
* ప్రస్తుతం ఎస్‌బీఐ 7.5 శాతం తక్కువ వడ్డీ రేటుకు బంగారు రుణాలను ఆఫర్ చేస్తుంది.
* తిరిగి చెల్లించేందుకు 36 నెలల సమయం ఉంటుంది.
* ఎస్‌బీఐ యోనో యాప్‌లో
గాని, బ్రాంచికి వెళ్లి గాని రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* ముందస్తు చెల్లింపు ఛార్జీలను ఎస్‌బీఐ రద్దు చేసింది. కాలపరిమితి కంటే ముందుగానే చెల్లించిన ఎలాంటి రుసములు విధించరు.
గోల్డ్ లోన్‌లో ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవల్సింది వడ్డీ రేట్లే అయినా మిగిలిన అంశాలను పరిశీలించాలి. అందులో ఒకటి కాలపరిమితి. కొన్ని బ్యాంకులు తిరిగి చెల్లింపులకు ఏడాది మాత్రమే సమయం ఇస్తున్నాయి. ఉదాహరణకి, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఒక సంవత్సరం కాలపరిమితితో బంగారంపై రుణాలు ఇస్తుండగా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బంధన బ్యాంక్‌లు వరుసగా నాలుగు,మూడు సంవత్సరాల కాలపరిమితో రుణాలు మంజూరు చేస్తున్నాయి.
0 Komentar