SBI Waives Processing Fees on Home Loans
till August 31
ఎస్‌బీఐ: ‘మాన్‌సూన్
ధమాకా ఆఫర్’ పేరుతో గృహరుణంపై పరిశీలనా రుసుము రద్దు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గృహరుణంపై పరిశీలనా రుసుమును రద్దు చేసింది. ఇది ఆగస్టు చివరి నాటికి రుణాలు
తీసుకునే వారికి వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం గృహరుణ మొత్తంపై 0.40శాతం వరకూ పరిశీలనా రుసుము (ప్రాసెసింగ్ ఫీజు)ను బ్యాంకు వసూలు
చేస్తోంది. ‘మాన్‌సూన్ ధమాకా ఆఫర్’ పేరుతో ఈ రుసుమును పరిమిత కాలంపాటు రద్దు
చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం తమ బ్యాంకు గృహ వడ్డీ
రేట్లు 6.70శాతమేనని, సొంతిల్లు కోసం చూస్తున్న వారికి ఇప్పుడు
మంచి అవకాశంగా ఎస్‌బీఐ పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయడం వల్ల
రుణగ్రహీతలపై కొంత భారం తగ్గుతుందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్,
డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా
గృహరుణానికి దరఖాస్తు చేసుకున్న వారికి 0.05 శాతం వడ్డీ
రాయితీని కల్పిస్తున్నట్లు చెప్పారు.
It’s raining offers for new home buyers! Apply for a Home Loan with NIL* processing fee.
— State Bank of India (@TheOfficialSBI) July 31, 2021
What are you waiting for? Visit: https://t.co/N45cZ1V1Db
*T&C Apply
#HomeLoan #SBI #StateBankOfIndia #MonsoonDhamakaOffer pic.twitter.com/nDbPb7oBhF
0 Komentar