September 2021 Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు
సెలవులు ఎప్పుడంటే?
బ్యాంకులు ఏయే తేదీల్లో పని
చేస్తాయో తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త
ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం
సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల
సెలవులు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 7
రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 5, 12, 19, 26
ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఈ ఆరు సెలవు దినాలు
ఎప్పుడూ ఉండేవే కాగా.. సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి
వచ్చింది. దీంతో 10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
0 Komentar