Simple One Electric Scooter Makes World Premiere with Claimed 236 Km Range – Details Here
Simple One Electric Scooter: ఒకసారి ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్లు – ముఖ్యమైన వివరాలు ఇవే
విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తన తొలి స్కూటర్ సింపుల్ వన్‌ను ఆవిష్కరించింది. 4.8 కేడబ్ల్యూహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 236 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తెలిపింది. ధర రూ.1,09,999 (ఎక్స్‌షోరూం)గా సంస్థ తెలిపింది. దీని గరిష్ఠ వేగం గంటకు 105 కిలోమీటర్లు కాగా, 2.95 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరించింది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం, జియో-ఫెన్సింగ్, ఎప్పటికప్పుడు అప్‌డేట్లు, నావిగేషన్ వ్యవస్థ, టైర్లలో గాలి ఒత్తిడి ఎంతుందో తెలియజేయడంలాంటి సదుపాయాలు ఈ స్కూటర్‌కు ఉన్నాయని తెలిపింది.
ఈ స్కూటర్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
సహా 13 రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ
వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. ఫేమ్2 నిబంధనల కింద రూ.60,000 వరకు రాయితీ పొందే
అవకాశమున్న ఈ స్కూటర్‌ను రూ.1,947తో బుకింగ్ చేసుకోవచ్చని
వెల్లడించారు. తమిళనాడులోని హోసూరులో 2లక్షల చదరపు అడుగుల్లో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, తొలి దశలో ఏడాదికి 10లక్షల స్కూటర్ల ఉత్పత్తి
సామర్థ్యం ఉంటుందని తెలిపారు.
ఓలా
ఎలక్ట్రిక్ స్కూటర్ VS సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఓలా
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1: ధర, ఫీచర్లు
మరియు మిగతా ముఖ్యమైన వివరాలు ఇవే
0 Komentar