Tirupati: Six-year-old boy becomes the
youngest Indian Microsoft office specialist
ఆరేళ్ల అనిరుధ్ శ్రీరామ్ మైక్రోసాఫ్ట్
ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత
తిరుపతికి చెందిన ఆరేళ్ల బాలుడు
రాజా అనిరుధ్ శ్రీరామ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత
సాధించి ఔరా! అనిపించాడు. సాకేత్ రామ్, అంజనా శ్రావణి దంపతుల
కుమారుడైన ఈ బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కరోనా సమయంలో
ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతూనే, తన పరిజ్ఞానాన్ని
పెంపొందించుకోవడానికి కంప్యూటర్‌పై సాధన చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎక్సెల్
షీట్ ఓపెన్ చేసి ఏ, బీ, సీ, డీ టైపు చేయడం ప్రారంభించాడు. గమనించిన తల్లిదండ్రులు అందులోని మెలకువలను
నేర్పించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షకు అనిరుధ్
సిద్ధమయ్యాడు.
నిరంతర సాధనతో స్కోరు క్రమంగా 1000కి 546 నుంచి 950కి
మెరుగుపడింది. మొదటి ప్రయత్నంగా ఆగస్టు 14న రాసిన పరీక్షలో
విజయం సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న పరీక్ష
రాసి ఉత్తీర్ణత సాధించాడు. అనిరుధ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్
సర్టిఫికేషన్ పొందడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
దక్కించుకున్నాడు. ఇందులో ఒడిశాకు చెందిన ఏడేళ్ల బాలుడి రికార్డును అనిరుధ్
అధిగమించడం విశేషం. అంతకుముందు ఈ బాలుడు 2019వ సంవత్సరంలో
నాలుగేళ్ల వయసులో 160 సెకన్లలో 100
కార్లను గుర్తించే అసాధారణమైన జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
పొందాడు. రాకెట్‌పై స్పేస్‌కు వెళ్లడమే తన లక్ష్యమని చెప్పాడు.
0 Komentar