Sonu Sood Launches 'Free Graduation Courses'
Across Streams to 'Empower the Youth' - Details Here
సోనూసూద్: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు
ఉచిత కోర్సులు – వివరాలు ఇవే
కరోనా వేళ, దేశవ్యాప్తంగా
సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్నారు నటుడు సోనూసూద్. తాజాగా గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త అందించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
యూనివర్సల్ ఎడ్యుకేషన్ సహకారంతో సూద్
ఛారిటీ ఫౌండేషన్ తరపున ముంబైలో ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, LLB, B.Ed, ఆర్కిటెక్చర్ లాంటి
కోర్సులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలని
చెప్పారు. సోనూ ఇప్పటికే సీఏ, లా కోర్సులు ఉచితంగా
అందిస్తున్నారు మరియు స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు.
వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.
గతేడాది లాక్‌డౌన్ కారణంగా పలు
ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఈ రియల్ హీరో సొంతంగా రవాణా సదుపాయాలు
కల్పించారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం కరోనా రెండో దశలోనూ కొనసాగుతోంది.
కరోనా బారిన పడినవారికి వైద్యం అందించడం, అత్యవసరంగా ఆక్సిజన్
అందుబాటులో ఉంచి ఆదుకోవడం.. వంటి కార్యక్రమాలతో ప్రజల మదిలో సూపర్ హీరోగా స్థానం
సంపాదించారు.
Happy to launch FREE GRADUATION COURSES across streams.
— sonu sood (@SonuSood) August 20, 2021
Lets EMPOWER the youth of INDIA🇮🇳
@UniversalEduIND
Details on https://t.co/juJL7WB7qo@soodfoundation 🇮🇳 pic.twitter.com/250Y6gi9t1
How to apply for IIIT
ReplyDelete