SSC Public Examinations, 2020 &
2021: Procedure for Declaration of The Results– Final Report Submitted
2020 & 2021 సంవత్సరాల 10
వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రకటన ప్రక్రియ - తుది నివేదిక గురించి ప్రభుత్వ ఉత్తర్వులు
జారీ
పదో తరగతి పరీక్షలు రద్దయిన
నేపథ్యంలో ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వాలని ఏపీ
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు ఆమోదం
తెలిపింది. 2020, 2021 పదో తరగతి ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన
చేయాలని గతంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే.
భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు
ఎదురవ్వకుండా 2019-2020 ఏడాదికి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన
విద్యార్థులందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. అంతర్గతంగా 50 మార్కులు చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల
ఆధారంగా ఈ గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు హాజరు
కాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం
తెలుపుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఇవాళ ఉత్తర్వులు జారీ
చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు
ఇవే:
★ SSC public Exams 2020 లో Grades Award చేయుటకు
SA1లో మార్కులు 50కు, 3FAలలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణనలోకి
తీసుకొని మొత్తము 100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని
బట్ఝి గ్రేఢులు నిర్ణయిస్తారు.
★ SSC Public Exams 2021 లో గ్రేడులు:
రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks
for Other components(10+10+10) లో 30%
మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల
ఆధారంగా గ్రేడులు ఇస్తారు. No fail. Last Grade ఇవ్వబడును.
★ FA లు వ్రాయని వారికి,
లేక ఆ మార్కులు Online చేయని Students కు
Last grade ఇచ్చి Pass చేస్తారు.
★ 2020 కు ముందు SSC చదివి
2017,2018,2019 పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal
marks ను బట్టి లేక 20
అంతర్గత మార్కులకు ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే
గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక Last
grade ఇస్తారు.
School Education - SSC Public
Examinations, 2020 & 2021 – Cancelled due to COVID Situation in the state –
Constitution of High-Power Committee to evolve the procedure for declaration of
the results of SSC Public Examinations – Final Report Submitted – Approval of
Recommendations of the Committee – Orders - Issued.
G.O.MS.No. 46 Dated: 02-08-2021
0 Komentar