Technology Tips and Tricks – 2: Useful Shortcuts
in Gmail
జీమెయిల్ లో పంపిన ఈమెయిల్స్ ను undo చేసేయండి ఇలా
======================
ప్రస్తుత కాలంలో అత్యధిక మంది
వినియోగించే ఈ-మెయిల్ సర్వీసుల్లో గూగుల్ సంస్థ అందించే జీమెయిల్ ముందుంటుంది.
యూజర్ ఫ్రెండ్లీగా, సులువుగా మెయిళ్లు పంపుకునేందుకు అనువుగా
ఉంటుంది. సెక్యూరిటీపరంగానూ యూజర్లకు పూర్తి భరోసా ఇస్తుంది. మెయిళ్లను పంపడం
ఎలాగో చాలా సులభంగా నేర్చేసుకోవచ్చు. అయితే జీమెయిల్ సర్వీస్లో ఉండే కొన్ని
ఫీచర్లు, సెట్టింగ్స్ ను సమర్థవంతంగా వాడుకుంటే ఇన్బాక్స్,
ఇతర టాస్క్ ల పనితీరును ఇంకా ప్రభావవంతంగా మార్చుకోవచ్చని టెక్
వర్గాలు పేర్కొన్నాయి. అలానే కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
జీమెయిల్ లో 'Undo
కంగారులో పొరపాట్లు చేయడం సహజం.
ఏదో పని ఒత్తిడిలోనో, ఇతర ఆలోచనలతోనో మెయిల్ చేసేటప్పుడు ఫైలనుగానీ,
ఇతర కొన్ని వివరాలను అటాచ్ చేయకుండా సెండ్ చేసేస్తుంటారు. అయితే
కొన్ని షార్ట్ కన్ను వినియోగించి మీరు పంపిన మెయిలను undo చేయవచ్చు.
అయితే డీఫాల్ట్ గా కేవలం ఐదు సెకన్లలోనే undo చేసే ఆప్షన్ సెట్
చేసి ఉంటుంది. దీనిని జీమెయిల్ లోని సెట్టింగ్స్ ఐకాన్ ను క్లిక్ చేసి 'undo’
సెట్టింగ్స్ లోకి వెళ్లి టైమ్ ను కాస్త పొడిగించుకోవచ్చు. సమయాన్ని 30 సెకన్ల వరకు పెంచుకునే వీలుంది. అయితే టైమ్ ను సెట్ చేసుకోవడం వల్ల మీరు
పంపే జీమెయిల్ కాస్త ఆలస్యంగా రిసీవర్‌కు చేరుతుంది. అత్యవసరమైన మెయిల్స్
చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
అవసరంలేని ఈమెయిల్స్ ను బ్లాక్..
ఎక్కువ ప్రైవసీ
అవసరంలేని ఎన్నో మెయిల్స్
వస్తుంటాయి. అలాంటప్పుడు డైరెక్ట్ గా సెండర్ నే బ్లాక్ చేసే ఆప్షన్ ను జీమెయిల్ కల్పించింది.
బ్లాక్ చేయడం వల్ల మీ ఇన్ బాక్స్ లోకి కాకుండా స్పామ్ ఫోల్డర్ లోకి అలాంటి
మెయిల్స్ వెళ్లిపోతాయి. వెబ్ లో మీ జీమెయిల్ తో సైన్ ఇన్ అయితే ప్రైవసీకి ఆటంకం
కలుగుతుందేమోనని అనుమానం కలుగుతుంది. వేర్వేరు సేవల కోసం ప్రత్యామ్నాయ మెయిల్
అడ్రెస్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీ మెయిల్ అడ్రస్ కు ప్లస్ సైన ను
యాడ్ చేసుకుంటే సరిపోద్ది.. అన్ని ఈ మెయిల్స్ ఈ అడ్రస్ కి వస్తున్నాయంటే ఏమేమి
సేవలు లీక్ అయ్యాయో తెలిసిపోతుంది.
వాట్సాప్ మాదిరిగా మెసేజ్ లకు ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉండదు. ఇలాంటప్పుడు అత్యంత రహస్యమైన మెయిల్స్ పంపించాలంటే కాస్త ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి దానికి గూగుల్ పరిష్కారం చూపింది. కాన్ఫిడెన్షియల్ మోడ్ను ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాన్ఫిడెన్షియల్ మోడ్లో 'ఎక్స్ పైరీ డేట్ ను సెట్ చేసుకోవడం వల్ల ... మీరు పంపిన ఈమెయిల్ రిసీవర్ ఇన్ బాక్స్ నుంచి అదృశ్యం అయిపోతుంది. అలానే మెయిల్ అందుకున్న యూజర్ మీ మెయిల్ ను ఫార్వర్డ్, కాపీ, ప్రింటింగ్, డౌన్ లోడింగ్ ఆగిపోతుంది. దీని కోసం ఎస్ఎంఎస్ పాస్ కోడ్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఇది కంపల్సరీ కాకుండా ఆప్షనల్ గా గూగుల్ ఇచ్చింది.
======================
======================
ఇన్ బాక్స్ కంట్రోల్స్ కోసం కీబోర్డ్ షార్ట్ కట్స్.. (See Above Screen)
యాప్ అయినా వెబ్ అయినా కీబోర్డ్
షార్ట్ కట్స్ ఉంటే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. Shift+ESC క్లిక్ చేస్తే మెయిన్
విండో వస్తుంది. ఈమెయిలను త్వరగా పంపించాలంటే Ctrl+Enter ప్రెస్
చేస్తే సరిపోయే. ఓల్డ్ డ్రాఫ్ట్ డిస్కార్డ్ కోసం Ctrl+ Shift+D. అలానే Ctrl+shiftతోపాటు C క్లిక్
చేస్తే మెయిల్ CC రిసిప్ట్ , Ctrl+shift తోపాటు B ప్రెస్ చేస్తే BCC రిసిప్ట్
ఓపెన్ అవుతుంది. జీమెయిల్ లో అన్ని షార్ట్ కట్లను చూడాలంటే సింపుల్ గా Shift+? క్లిక్
చేస్తే క్లియర్ గా కనిపిస్తాయి.
======================
0 Komentar