Telegram will now allow 1000 viewers to
be part of video calls
టెలిగ్రామ్: ఇక గ్రూప్ వీడియో కాల్ లో వీక్షకుల సంఖ్య వెయ్యి మంది - కొత్త హంగులను జోడించిన ‘టెలిగ్రామ్’
మెసేజింగ్ వేదిక ‘టెలిగ్రామ్’
సరికొత్త హంగులను జోడించింది. ప్రధానంగా వీడియో కమ్యూనికేషన్‌పై దృష్టి
సారించింది. జూన్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్‌ను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
అందులో భాగస్వాములయ్యేవారి సంఖ్యను తాజాగా వెయ్యి మందికి పెంచింది. దీనివల్ల అంతమంది
ఆన్‌లైన్ ఉపన్యాసాలను వీక్షించొచ్చని తెలిపింది. చిన్న సంస్థలు దీనివల్ల ప్రయోజనం
పొందుతాయని పేర్కొంది.
గరిష్ఠ వీక్షకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతామని వివరించింది. అయితే వీడియో కాల్‌ను ప్రసారం చేయగలిగేవారి సంఖ్య 30కే పరిమితమవుతుందని తెలిపింది. వీడియో సందేశాల రిజల్యూషన్‌నూ టెలిగ్రామ్ పెంచింది. వీటికితోడు వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ ఆప్షన్లు, సౌండ్‌తో కూడిన స్క్రీన్ షేరింగ్ వంటి వెసులుబాట్లనూ అందుబాటులోకి తెచ్చింది.
0 Komentar