Those Joining NPS After 65 Yrs of Age
Can Invest Up To 50% Of Funds in Equities
65 ఏళ్లు నిండిన ఎన్‌పీఎస్
(NPS) చందాదారులకు ఈ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం
జాతీయ పింఛను వ్యవస్థను (ఎన్‌పీఎస్)
చందాదార్లకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వీలుగా భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి
ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చర్యలు తీసుకుంది. 65 ఏళ్లు
నిండిన తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే చందాదార్లు తమ నిధుల్లో 50శాతం
వరకు ఈక్విటీలకు మళ్లించే ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. అలాగే పథకం
నుంచి బయటకు సులువుగా వెళ్లేందుకు నిబంధనల్ని సడలించింది. ఎన్‌పీఎస్‌లో చేరేందుకు
ప్రస్తుతమున్న 18-65 ఏళ్లను 18-70
ఏళ్లకు పెంచింది.
భారతీయ పౌరులు లేదా విదేశాల్లో
ఉంటున్న భారతీయ పౌరులు (ఓసీఐ) 65-70 ఏళ్ల మధ్యలోనూ ఎన్‌పీఎస్‌లో చేరే
అవకాశం కల్పించింది. సవరించిన నిబంధనల ప్రకారం వారు 75ఏళ్ల
వరకు కొనసాగవచ్చు. ఇప్పటికే చందాదార్లుగా ఉండి తమ ఖాతాను ముగించిన వారికి కొత్త
ఖాతా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
0 Komentar