Tokyo Olympics 2020: India Wins Historic
Men's Hockey Bronze, First Medal Since 1980 Gold
టోక్యో ఒలింపిక్స్ 2020: 41 ఏళ్ల తర్వాత హాకీలో పతకం – ఈ ఒలింపిక్స్ లో ఇండియా
కి 4వ పతకం
అఖండ భారతావని మురిసిపోయింది. అశేష ప్రజానీకం ఉప్పొంగి పోయింది. 130+కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టోక్యో నడిబొడ్డున త్రివర్ణ పతకాం రెపరెలాడింది. చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగాయి..
ఇక హాకీ ఇండియాకు పునర్వైభవం రానుంది. 4 దశాబ్దాల తర్వాత స్వర్ణోదయానికి అడుగులు పడ్డాయి. ఎన్నాళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది. ఎన్నేళ్లో వేచిన హృదయాలకు తీపి కబురు ఇది. ఒలింపిక్స్‌లో పతకాల కరవు తీరుస్తూ ‘మన్’ప్రీత్ సేన ఆవిష్కరించిన మహాద్భుతం ఇది..
నిజం చెప్పాలంటే ఒలింపిక్స్ పసడి పతక పోరులోనైనా ఇంత ఉత్కంఠ ఉంటుందా? ఎన్ని సూపర్ ఓవర్లు చూస్తే ఇంత టెన్షన్ అనుభవిస్తాం? క్రికెట్లో ఎన్ని సిక్సర్లు బాదితే ఇంతటి మజా వస్తుంది? ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిస్తే ఎంత ఖుషీ అవుతామో అంతకు మించి ఉత్కంఠభరితమైన విజయం అందించింది మన్‌ప్రీత్ సేన.
ఆఖరి క్వార్టర్లో నిమిషాలు గడిచే కొద్దీ.. సెకన్లు ముగిసే కొద్దీ.. కంటిరెప్పలు సైతం వాల్చలేనంతటి నర్వస్‌నెస్.. చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్.. ఆ అవకాశం చేజార్చుకుంటే 41 ఏళ్ల కల కలగానే ఉండిపోతుంది. సరికొత్త చరిత్రకు అంకురార్పణ ఆగిపోతుంది. అందుకే ఇది పసిడి పోరును మించిన పోరాటం.
సాహో.. హాకీ ఇండియా!! సాహో మన్‌ప్రీత సేన!! సాహో భారత్!!
పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన
పోరులో హాకీ ఇండియా దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది.
పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయం సాధించింది. 41
ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య
పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4
తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్
సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్
(27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు. జర్మనీలో టిముర్ ఒరుజ్ (2ని),
నిక్లాస్ వెలెన్ (24ని), బెనెడిక్ట్ ఫర్క్ (25ని), లుకాస్
విండ్‌ఫెదెర్ (48ని) రాణించారు.
0 Komentar