Tokyo Olympics: Ravi Kumar Dahiya
Ensures At Least a Silver Medal for India; Enters into Final
Tokyo Olympics 2020: తొమ్మిదేళ్ల
తర్వాత రెజ్లింగ్‌లో ఫైనల్‌కు భారత రెజ్లర్ - పసిడి/రజతం లో ఒకటి ఖాయం చేసిన
కుస్తీవీరుడు రవి
సెమీస్‌లో దీపక్ పునియా ఓటమి - కాంస్యం
కోసం పోటీ
భారత రెజ్లర్ రవి కుమార్ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకున్నాడు. భారత్‌కు కనీసం రజతం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో స్వర్ణ పోరుకు అర్హత సాధించాడు. 7-9 తేడాతో కజక్‌స్థాన్ కుస్తీవీరుడు సనయెవ్ నురిస్లామ్‌ను ఓడించాడు.
తొలి రెండు మ్యాచుల్లో
ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు అందుకున్న రవికి సెమీస్‌లో కఠిన పరీక్షే
ఎదురైంది. నురిస్లామ్ మొత్తంగా ఆధిపత్యం చెలాయించాడు. తొలుత రిఫరీ నిర్దేశించి 30
సెకన్లలో రవి పాయింటు తేకపోవడంతో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతలోనే
పుంజుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్లు అందుకున్నాడు. 2-1తో మొదటి
పిరియడ్‌ను ముగించాడు.
ఇక కీలకమైన రెండో పిరియడ్‌లో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టిన నురిస్లామ్ అతడిని మెలికలు తిరిగేలా చేశాడు. దాంతో వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు సాధించాడు. 9-2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక రవి గెలవడం కష్టమేనన్న పరిస్థితి తలెత్తింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ప్రత్యర్థిపై దూకుడుగా ఆడిన రవి 1, 2 ,2 పాయింట్లతో స్కోరును 7-9కి తగ్గించాడు. అప్పుడే నురిస్లామ్ గాయపడటం రవికి కలిసొచ్చింది. ఇదే అదనుగా అతడిని పడగొట్టిన రవి.. పూర్తిగా 30 సెకన్లపాటు లేవకుండా రింగులోనే అడ్డుకోగలిగాడు. విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఫైనల్‌కు చేరుకున్నాడు. అఖండ భారతావనిని మురిపించాడు.
భారత్ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్
చేరిన రెండో ఆటగాడు రవి కుమార్. అంతకు ముందు సుశీల్ కుమార్ 2008 బీజింగ్‌లో
కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకొని రజతంతో
మురిపించాడు. 2012లో యోగేశ్వర్ కాంస్యం గెలిచాడు. తొమ్మిదేళ్ల తర్వాత రవి రూపంలో
భారత రెజ్లర్ ఫైనల్ చేరడం ప్రత్యేకం.
సెమీస్‌లో దీపక్ పునియా ఓటమి - కాంస్యం కోసం పోటీ
భారత మరో రెజ్లర్ దీపక్ పునియాకు
ఓటమి ఎదురైంది. సెమీస్‌లో అతడు 0-10 తేడాతో ఓటమి పాలయ్యాడు. అమెరికా కుస్తీ వీరుడు
టేలర్ డేవిడ్ మోరిస్ సాంకేతికంగా ఆధిపత్యం సాధించాడు. ఇక దీపక్ కాంస్యం కోసమే
పోరాడనున్నాడు.
0 Komentar