TS: ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్ నంబరు అనుసంధానం - పోస్టుమ్యాన్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు: తపాలాశాఖ
ఆధార్ సంఖ్యతో ఫోన్ నంబరును
అనుసంధానం చేయించాలన్నా, పాత నంబరు స్థానంలో కొత్తది చేర్చాలన్నా
ఇంటివద్ద నుంచే ఈ సేవలు పొందొచ్చని తెలంగాణ తపాలా సర్కిల్ పేర్కొంది.
పోస్టుమ్యాన్, బ్రాంచి పోస్టుమాస్టర్‌కు ఫోన్ చేసి కోరితే
ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారని తపాలాశాఖ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్
డైరెక్టర్ జె.శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పోస్టాఫీసుల్లో
అందించిన ఈ సేవల్ని ఇప్పుడు ఇంటివద్దకు విస్తరించామని.. ఇందుకోసం రూ.50 ఛార్జిగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
534 మంది పోస్టుమ్యాన్‌లు,
4156 బ్రాంచి పోస్టుమాస్టర్ల ద్వారా ఈ సేవల్ని అందించాలని హైదరాబాద్
రీజియన్ నిర్ణయించింది. పోస్టుమ్యాన్ వద్ద ఉండే ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌తో ఈ
సేవలు అందిస్తారు. పోస్టాఫీసుల్లో ఈ సేవల్ని ఏప్రిల్ 1
నుంచి ఆగస్టు 16 వరకు 14,675 మందికి
అందించినట్లు తపాలాశాఖ పేర్కొంది. ఆధార్‌కు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేయడం,
చిరునామా మార్పు, పుట్టినరోజు తేదీలో
తప్పులుంటే సరిదిద్దడం వంటి సేవలకు మాత్రం పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
0 Komentar