TS EAMCET-2021: Examinations Starting
from Today (04-08-2021)
నేటి నుంచే తెలంగాణలో ఎంసెట్-2021
పరీక్షలు – పాటించవలసిన నియమాలు ఇవే
రాష్ట్రంలో బుధవారం నుంచి ఎంసెట్
ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి
అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10
తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్
తెలిపారు. విద్యార్థులు మాస్కులు ధరించాలి. గ్లౌజ్‌లు, శానిటైజర్లను
తీసుకెళ్లాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా
ఆరోగ్య వివరాలను వెల్లడించాలి. కాగా, ఎంసెట్‌కు 2,51,606
మంది (1,64,962 మంది ఇంజనీరింగ్, 86,644 మంది అగ్రికల్చర్)
దరఖాస్తు చేశారు.
ఈసెట్‌కు 95% పైగా విద్యార్థుల
హాజరు
మంగళవారం ఈసెట్‌కు 95.46 శాతం మంది
హాజరయ్యారు. 24,808 మంది దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 37 కేంద్రాలు, ఏపీలోని
4 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో
ప్రశ్నపత్రాల ఎంపిక జరిగింది.
0 Komentar