Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్ షీట్లు‌, కీ విడుదల - తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే

 

TS EAMCET-2021: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్ షీట్లు‌, కీ విడుదల - తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీని ఎంసెట్‌ పరీక్షల కన్వీనర్‌ గోవర్దన్‌ విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై ఎమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రెస్పాన్స్‌ షీట్లు, కీని వర్సిటీ వెబ్‌సైట్‌లో లింక్‌1 అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ వెల్లడించారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు ఈనెల 25వ తేదీన వెలువడనున్నాయి. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ తేదీని ఖరారు చేసింది. కౌన్సెలింగ్‌ను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన ఈ నెల 10న ఎంసెట్‌ ప్రవేశాల కమిటీల సమావేశం నిర్వహించారు. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 25న విడుదల చేయాలని నిర్ణయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు 20వ తేదీతో ముగియనుంది.

 

తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్

* ఆగస్టు 30- సెప్టెంబరు 9: ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం

* సెప్టెంబరు 4-11: ధ్రువపత్రాల పరిశీలన

* 4-13: వెబ్‌ ఆప్షన్లు

* 15న: సీట్ల కేటాయింపు

* 15-20 వరకు: వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌


MASTER QUESTION PAPERS & PRELIMINARY KEYS

KEY OBJECTIONS

RESPONSE SHEET

TS EAMCET WEBSITE

COUNSELLING WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags