Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021: Final Phase - Seat Allotment Details

 

TS EAMCET-2021: Final Phase - Seat Allotment Details

టీఎస్‌ ఎంసెట్ - 2021:  కౌన్సెలింగ్‌ వివరాలు ఇవే


UPDATE 12-11-2021

Final Phase: College-wise Allotment Details 👇

WEBSITE

=========================  

UPDATE 03-11-2021

నవంబర్ 6 నుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌, 12న సీట్ల కేటాయింపు

తొలి విడత సీట్ల రద్దుకు తుది గడువు 5వ తేదీ

ఎంసెట్‌ మొదటి విడత సీట్లు కేటాయించిన నెలన్నర తర్వాత చివరి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఖరారైంది. ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌మిత్తల్‌ తదితరులు మంగళవారం సమావేశమై చివరి విడతతో పాటు స్పెషల్‌ రౌండ్‌ కాలపట్టిక కూడా ఖరారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల్లో కొత్త బీటెక్‌ సీట్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో కేవలం అంతకుముందు సీట్లు వచ్చిన వారు మాత్రమే మెరుగైన సీట్లకు ప్రయత్నించాల్సి ఉంటుంది. కొత్త అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదు. అంటే చివరి విడత కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు రద్దు చేసుకొని వెళ్లిపోతే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రౌండ్‌ జరుపుతున్నారు.

చివరి విడత షెడ్యూల్ ఇదే

* నవంబరు 6-7వ తేదీ: ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌

* 8వ తేదీ: స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన

* 6-9వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు

* 12వ తేదీ: సీట్ల కేటాయింపు

* 12-15వ తేదీ వరకు: ఫీజు చెల్లింపు

* 18వ తేదీ: సీట్ల రద్దుకు తుది గడువు

 

ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

* 20-21 వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు

* 24న: సీట్ల కేటాయింపు

* 26వ తేదీ: సీట్ల రద్దుకు తుది గడువు

* 25వ తేదీ: స్పాట్‌కు మార్గదర్శకాల విడుదల 

TS EAMCET-2021 FINAL PHASE COUNSELLING NOTIFICATION

HELPLINE CENTERS FOR CERTIFICATION VERIFICATION

WEBSITE

 

5వ తేదీలోపు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు వాపస్‌

తొలి విడతలో దాదాపు 46వేల మంది ఆయా కళాశాలల్లో చేరినట్లుగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. వారిలో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా సీట్లు రద్దు చేసుకున్నారు. మిగిలిన వారిలో ఎవరైనా ఈనెల 5వ తేదీలోపు సీట్లు రద్దు చేసుకుంటే చెల్లించిన పూర్తి ఫీజు తిరిగి చెల్లిస్తారు. అంటే అప్పటికి జోసా రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

చివరి విడతలో సీట్ల కేటాయించిన తర్వాత 18వ తేదీలోపు సీట్లు రద్దు చేసుకుంటే చెల్లించిన ఫీజులో 50 శాతమే ఇస్తారు. చివరి విడతలో కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని సీటు పొందిన వారు ఆసక్తి లేకుంటే రుసుం చెల్లించకుండా ఉండొచ్చు.  స్పెషల్‌ రౌండ్‌లో సీట్ల తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే మాత్రమే ఫీజు వాపస్‌ రాదని అధికారులు తెలిపారు. ఈ రౌండ్‌లో సీట్లు మిగిలిపోతే స్పాట్‌ అడ్మిషన్లకు కలుపుతారు.

===========================

UPDATE ON 18-09-2021

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మొదటి విడతలో 82.24 శాతం ఇంజినీరింగ్ సీట్లను కేటాయించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. బీటెక్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,941 సీట్లను భర్తీ చేశామన్నారు. మొదటి విడత కేటాయింపు అనంతరం కన్వీనర్ కోటాలో ఇంకా 13,130 సీట్లు మిగిలిపోయాయని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 సీట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. 31 ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలి విడతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయన్నారు.

ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన తగ్గిందని పేర్కొన్నారు. బీఫార్మసీలో 4199, ఫార్మ్ డీ సీట్లలో కేవలం 228 భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23లోపు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విద్యార్థులకు సూచించారు.

COUNSELLING WEBSITE



UPDATE ON 02-09-2021

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 11 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 18న ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి.

ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈ నెల 4 నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. మరోవైపు ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ యథాతథంగా జరగనుంది. ఈ నెల 4నుంచి 11వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. కళాశాలల గుర్తింపు ప్రక్రియ జాప్యంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

MOCK COUNSELLING LINK 1

MOCK COUNSELLING LINK 2

COUNSELLING WEBSITE


UPDATED ON 25-08-2021

ఫలితాల వివరాలు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల విడుదల సందర్భంగా తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం ర్యాంకులను వెల్లడించారు.

RESULTS LINK 1

RESULTS LINK (ENGG)

RESULTS LINK (AM)


RESULTS LINK (OFFICIAL WEBSITE)

DOWNLOAD RANK CARD (OFFICIAL WEBSITE)


కౌన్సెలింగ్ వివరాలు:

మొదటి విడత కౌన్సెలింగ్ వివరాలు:

ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

TS EAMCET WEBSITE

COUNSELLING WEBSITE

MOCK COUNSELLING

COUNSELLING DETAILED NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags