TS ECET-2021: College-wise Allotment Details - Provisional Allotment List (First Phase)
టీఎస్ ఈసెట్-2021: మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
UPDATE ON 02-09-2021
తెలంగాణలో ఈసెట్ అభ్యర్థులకు మొదటి
విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో
సంవత్సరంలో సీట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 168 ఇంజినీరింగ్
కాలేజీల్లో ఈసెట్ అభ్యర్థులకు 9,688 సీట్లు ఉండగా.. మొదటి
విడతలో 8,783 (90.65 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.
రాష్ట్రంలోని పది యూనివర్సిటీల్లో 783 సీట్లు ఉండగా.. మొదటి
విడతలోనే అన్నీ భర్తీ అయిపోయాయి. ప్రైవేట్ కళాశాలల్లో 89.89
శాతం సీట్లు కేటాయింపు పూర్తయింది.
బీఫార్మసీలో ఈసెట్ అభ్యర్థులకు 1,029 సీట్లు అందుబాటులో ఉండగా... కేవలం 54 సీట్లు
మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 7వ
తేదీలోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 18 నుంచి 21 మధ్య కళాశాలల్లో చేరాలన్నారు. ఈసెట్ తుది
విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 13న ప్రారంభం కానుంది. ఈనెల 14న ధ్రువపత్రాల పరిశీలన, 14, 15 తేదీల్లో వెబ్
ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఈనెల 17న తుది విడత సీట్లను
కేటాయించనున్నారు.
Update on 18-08-2021:
తెలంగాణ ఈసెట్ ఫలితాలు నేడు (18-08-2021) ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి.
జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లోని యూజీసీ-హెచ్‌ఆర్‌డీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
Counselling Details:
పాలిటెక్నిక్ అభ్యర్థులు
ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన
ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా మండలి
ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు
చేశారు.
తొలి విడత కౌన్సెలింగ్
ఈనెల 24
నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్
చేసుకోవాలి. ఈనెల 26 నుంచి 29 వరకు
ఈసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 26వ తేదీ
నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
సెప్టెంబరు 2న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్
చేయాలి.
తుది విడత కౌన్సెలింగ్
సెప్టెంబర్ 13వ
తేదీ నుంచి ఈసెట్ తుది విడత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 14న ధ్రువపత్రాల పరిశీలన, 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 18 నుంచి 20 వరకు విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్,
సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సెప్టెంబర్ 18న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్ మిత్తల్
వెల్లడించారు.
0 Komentar