TS: వృద్ధాప్య పింఛను వయో
పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ
వృద్ధాప్య పింఛను వయో పరిమితిని 57
సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు
వృద్ధాప్య పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా ప్రభుత్వం 57ఏళ్లకు తగ్గించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో వృద్ధాప్య పింఛను
వయోపరిమి తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించడంతో
అధికారులు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు
తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు
చేరుకుంటుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం
ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ
చేయాలని ఆదేశించారు.
0 Komentar