TSCHE ties up with TCS iON: డిగ్రీ విద్యార్థులకు టిసిఎస్ అయాన్ శిక్షణ – ఉన్నత విద్యామండలి తో అయాన్
ఒప్పందం
రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు
ఉద్యోగావకాశాలను పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ అయాన్ తో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది.
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆగస్టు 17న జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కుమార్ సమక్షంలో ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, టీసీఎస్ అయాన్
గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు.
విద్యార్థులకు డేటా సైన్స్, గణితం,
స్టాటిస్టిక్స్ -కోర్సులను బోధిస్తారు. ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ.. రాష్ట్ర యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను
అమలు చేస్తోందన్నారు. విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ... త్వరలో ఆయా
వర్సిటీలకు వెళ్లి ఈ శిక్షణపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఒప్పందం కుదుర్చుకున్న వర్సిటీలు, కళాశాలలకు టీసీఎస్ అయాన్
ప్రతినిధులు వెళ్లి శిక్షణ ఇస్తారని చెప్పారు.
0 Komentar