UBI Recruitment 2021: 347 Vacancies for
Managers and Other Posts
యూబీఐ లో 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఖాళీలు
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 2021-2022 సంవత్సరానికి
గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 347
పోస్టులు: సీనియర్ మేనేజర్లు-60, మేనేజర్లు-141, అసిస్టెంట్మేనేజర్లు-146.
విభాగాలు: రిస్క్ సివిల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్,
ఆర్కిటెక్ట్ ఇంజినీర్, ప్రింటింగ్
టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్
అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకి 30 నుంచి 40 ఏళ్లు, మిగిలిన
పోస్టులకి 25 నుంచి 35 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్
ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం
200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 4 విభాగాల
నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు ఉంటుంది.
1) రీజనింగ్ 50 ప్రశ్నలు 25 మార్కులు
2) క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు
3) పోస్టుకి సంబంధించిని
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 100
మార్కులు
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు - 25 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.08.2021.
దరఖాస్తులకి చివరి తేది: 03.09.2021.
0 Komentar