Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC Has Declared 24 Institutes as Fake Universities: Dharmendra Pradhan

 

UGC Has Declared 24 Institutes as Fake Universities: Dharmendra Pradhan

భారత్‌లో యూ‌జి‌సి గుర్తించిన ఫేక్‌ యూనివర్సిటీల లిస్టు ఇదే - విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

యూపీలో అత్యధికంగా 8 వర్సిటీలు

పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్‌ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్‌ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారం పై  ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్‌ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్‌ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్‌ యూనివర్సిటీల లిస్టు ఇదే..

ఉత్తరప్రదేశ్‌ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్‌ విద్యాపీఠ్, అలహాబాద్‌; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్‌; నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, కాన్పూర్‌; నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, అలీగఢ్‌; ఉత్తరప్రదేశ్‌ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్‌ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్‌; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా

ఢిల్లీ (7): కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వకేషనల్‌ యూనివర్సిటీ, ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యురిడిసియల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ)

పశ్చిమబెంగాల్‌ (2): ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్, కోల్‌కతా; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్, కోల్‌కతా

ఒడిశా (2): నవభారత్‌ శిక్షా పరిషద్, రూర్కెలా, నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ.

మిగతా రాష్ట్రాలు (5): పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని  రాజా అరబిక్‌ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీలు కూడా ఫేక్‌ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags