Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC NET 2021 Exam from Oct 6, NTA Reopens Registration Window – Details Here

 

UGC NET 2021 Exam from Oct 6, NTA Reopens Registration Window – Details Here

యూజీసీ నెట్ 2021: ఒకేసారి డిసెంబర్-జూన్ యూజీసీ నెట్ సెషన్లు – వివరాలు ఇవే

కరోనా కారణంగా యూనివర్సిటీ గ్రాట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబరు-2020 పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి సంబంధించి జూన్-2021 సెషన్ పరీక్ష కూడా ఇప్పటికే నిర్వహించాల్సి ఉంది. డిసెంబర్ సెషన్ పరీక్ష ఇప్పటికీ జరగకపోవడంతో జూన్ సెషన్ సైతం వాయిదా పడింది. దీంతో డిసెంబర్-జూన్ రెండు సెషన్లను కలిపి ఒకేసారి నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఇందులో భాగంగా జూన్-2021 సెషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5, 2021 వరకు కొనసాగనుంది. రెండు సెషన్ల పరీక్ష అక్టోబర్ 6 నుంచి 11 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో జరుగుతుంది. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మరోవైపు డిసెంబర్ సెషన్ కు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు పూర్తి చేయని వారికి యూజీసీ మరోసారి అవకాశం కల్పించింది.

సంబంధిత వెబ్ సైట్లో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలని సూచించింది. డిసెంబర్-జూన్ సెషన్ల జేఆర్ఎఫ్ స్లాట్లను కలపనున్నట్లు పేర్కొన్న యూజీసీ.. సబ్జెక్టులు, కేటగిరీల పద్ధతి విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

PUBLIC NOTICE 10-08-2021

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags